AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని చంపిన కొడుకు..

మద్యం కోసం డబ్బు ఇవ్వలేదు అని ఏకంగా కన్నతల్లినే చంపేశాడు..మెదక్ జిల్లా హావేలి ఘనాపూర్ మండలం తొగుట గ్రామంలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే..తొగుట గ్రామానికి చెందిన పుస్తె నర్సమ్మ (40)రోజువారీగా కూలి పనికి వెళ్తుండేది.

అయితే నిన్న కూడా యధావిధిగా కూలి పనులకు వెళ్లి,పని ముగించుకొని రాత్రి ఇంటికి వచ్చింది..ఇంట్లో పనులు చేసుకుంటు ఉండగా తాగడానికి డబ్బులు కావాలి అని తన తల్లిని అడిగాడు చిన్నకొడుకు భాను ప్రసాద్.. అయితే తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది తల్లి నర్సమ్మ.. ఈ నేపథ్యంలో తల్లి, కొడుకుల మధ్య మాట మాట పెరిగింది..గొడవ పడుతూ ఆవేశంతో ఊగిపోయి భాను ప్రసాద్ కత్తితో తన తల్లి పై దాడి చేసాడు.

దీనితో తల్లి నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.. మొదటి నుండి భాను ప్రసాద్ ఇంట్లో ఏదో ఒక గొడవ చేస్తూ తన తల్లిని ఇబ్బంది పెట్టేవారు అని చెబుతున్నారు . వైపు విషయం తెలియగానే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నర్సమ్మను దాడి చేసి హత్య చేసిన భాను ప్రసాద్ ని అరెస్ట్ చేసారు. ఘనపూర్ పోలీసులు.. నర్సమ్మ మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ANN TOP 10