AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక..

గోదావరి నదికీ వరద నీరు పెరుగుతుండటంతో ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి గోదావరి నీటి మట్టం 53.1 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం పెరుగుతుండటంతో భద్రాచలంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలంలో స్నానఘట్టాల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడంతోపాటు బందోబస్తు ఏర్పాటు చేశారు. నీటి మట్టం 56 అడుగుల నుండి 58 అడుగులకు చేరుకునే అవకాశముందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

ANN TOP 10