AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిద్దిపేటలో కలకలం.. కలుషితం జలం తాగి పలువురికి అస్వస్థత

వరుసగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే సీజనల్‌ వ్యాధులు మొదలయ్యాయి. మరో వైపు ఇదే వర్షలకు కొన్ని చోట్ల తాగే మంచి నీరు కలుషితం అవుతుండడంతో అస్వస్థతకు గురి అవుతున్నారు కొంతమంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపూర్‌, దుంపలపల్లి గ్రామాల్లో మంచినీరు కలుషితం అవ్వడంతో రెండు గ్రామాల్లోని 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్నటి నుంచి వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు.

పరిస్థితి విషమంగా ఉన్నవారిని రాత్రి సిద్దపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.. కాగా దుంపలపల్లి, బల్వంతపూర్‌ గ్రామాల్లో హెల్త్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. మళ్లీ ఏమైనా ప్రమాదం సంభవిస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ హెల్త్‌ క్యాంప్‌ లను ఏర్పాటు చేసారు. అస్వస్థతకు గురైన వారు అందరూ సేఫ్‌ గానే ఉన్నారు అని వైద్యులు చెప్పారు..మరో వైపు సీజనల్‌ వ్యాధులు, కలుషిత నీరు వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి మంచినీటిని వేడి చేసి తాగాలని సూచిస్తున్నారు వైద్యులు.

ANN TOP 10