AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ఎటు పోతుందో .. కల్వకుంట్ల కుటుంబంతో ఇక యుద్ధమే..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్‌
కల్వకుంట్ల కుటుంబంతో యుద్ధం మొదలైందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బాటాసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళుతున్న ఆయనను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కేవలం డబుల్‌ బెడ్‌రూంలను చూడడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం దుర్మా ర్గమని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గురువారం డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించడానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావుతో కలిసి బాటసింగారం వెళ్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ యుద్ధం మెదలు పెట్టారని… బీజేపీ యుద్ధన్ని ముగిస్తుందని స్పష్టం చేశారు. ఆట మెదలైందని, ఆట ఎలా ఆడాలో బీజేపీకి తెలుసునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో 50 లక్షల ఇళ్ళు కట్టే దమ్ముందా?.. కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తనదని అన్నారు. ప్రభుత్వ క్వాటర్స్ కూల్చివేసి కేసీఆర్ పది ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు.

తన రాజకీయ జీవితం పోరాటాలతో మొదలైందని, తాను ఉగ్రవాదిని కాదని.. సంఘ విద్రోహ శక్తిని అంతకన్నా కాదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న తనను.. రోడ్డు బ్లాక్ చేసి కాన్వాయ్‌ను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తమ‌ నీడను చూసుకుని కల్వకుంట్ల కుటుంబం భయపడుతోందన్నారు. కేసీఆర్ అభద్రతాభావంలో ఉన్నారని, మొండి గోడలను పరిశీలిస్తే కేసీఆర్‌కు వచ్చిన బాధ ఎంటో చెప్పాలన్నారు. బీజేపీ నేతలను అరెస్టులతో ఆపలేరని.. పేదల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోందన్నారు.

డబుల్‌ బెడ్‌రూంలను చూడకుండా అడ్డుకుని, ఆకారణంగా కార్యకర్తలను పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్, బోధనలో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేశారు. బీజేపీ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. ఎటు పోతుందో తెలంగాణ అర్థం కావడం లేదు. నియంతృత్వ దోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ANN TOP 10