AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పోలీసులతో సహా 9మంది మృతి

గుజరాత్‌లో ఘోరు రోడ్డు ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్-గాంధీనగర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇస్కాన్ పైవంతెన వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులతోపాటు తొమ్మిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10