సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. బెంగళూరులో రెండు రోజులపాటు జరిగిన విపక్షాల కూటమిలో ఢిల్లీ నుంచి కర్ణాటకకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత మంగళవారం సాయంత్రం తిరిగి ఢిల్లీ బయల్దేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో వారు ప్రయాణిస్తున్న విమానం కొంత దూరం ప్రయాణించిన తర్వాత మధ్యప్రదేశ్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని పైలట్ నిర్ణయించాడు. అందుకోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి తీసుకున్న తర్వాత భోపాల్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం.. ప్రతికూల వాతావరణం కారణంగా భోపాల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని భోపాల్ పోలీసులు వెల్లడించారు.









