AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లో నయాజోష్‌

– జోరుగా చేరికలు
– కంది శ్రీనన్న వెంటే నడుస్తున్న జనం
ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ లో నయా జోష్‌ కనిపిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని భగత్‌ సింగ్‌ నగర్‌ కాలనీలో జరిగిన చేరికల కార్యక్రమానికి కంది శ్రీనివాస రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించారు. కంది శ్రీనివాస రెడ్డి రాకను పురస్కరించుకొని కాలనీవాసులు ఆయనను ఘనంగా స్వాగతించారు. అనంతరం పెద్ద సంఖ్యలో 15వ వార్డు కాలనీవాసులు కిజర్‌ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికీ కండువా కప్పి కంది శ్రీనివాస రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను గురించి కంది శ్రీనివాస రెడ్డి ప్రజలకు తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ, రైతుబంధు, పోడు భూములకు పట్టాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, డబల్‌ బెడ్రూం లు,షాదీ ముబారక్‌ వంటి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే జోగు రామన్న పనితీరుపై ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ,15 వేల రైతుబంధు, రైతు భీమా, పోడు భూములకు పట్టాలు ఇస్తామని తెలిపారు.

స్కాలర్షిప్‌ లు, రేషన్‌ కార్డులు, 5 వేల రూపాయల పింఛన్లు, నిరుద్యోగ భతి వంటి హామీలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇస్తామన్నారు. పార్టీ పటిష్టత కోసం క్షేత్రస్థాయిలో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిమ్మ సంతోష్, డిస్ట్రిక్ట్‌ ఐఎన్‌టీయూసీ వైస్‌ ప్రెసిడెంట్‌ కొండూరి రవి, అఫ్రోజ్‌ ఖాన్, అబ్దుల్‌ సమాద్, షేక్‌ అన్వార్, షేక్‌ ఫిరోజ్, సమీ ఉల్లా ఖాన్, షేక్‌ అయ్యుబ్, అబ్దుల్‌ రషీద్, సయ్యద్‌ ఆశ్రఫ్, షేక్‌ బాబు, షేక్‌ మన్సూర్‌ సీనియర్‌ నాయకులు, 24 వార్డు అధ్యక్షుడు మానే శంకర్, ఎల్మా రామ్‌ రెడ్డి, షేక్‌ షహీద్, మొహమ్మద్‌ ముఖీమ్‌ పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

ANN TOP 10