కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రమాదంలో 48 మంది చనిపోగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే లొండియాని జంక్షన్‌లో ఓ ట్రక్ అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీ కొనడంతోపాటు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు గుర్తించామని స్థానిక పోలీస్ కమాండర్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు విలియం రూటో సంతాపం వ్యక్తం చేశారు.









