AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గాయకుడు సాయిచంద్ స్థానం ఆమెదేనా?.. బీఆర్ఎస్ సభలో సందడి

తెలంగాణ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ మృతితో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతిలో ఉన్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రతి సభలో కూడా సాయిచంద్ తన ఆట, పాటతో ప్రజల్లో ఉత్సాహం నింపేవారు. అతని గొంతుతోనే ఆ సభ అయినా ప్రారంభం, ముగింపు ఉండాల్సిందే. కానీ సాయిచంద్ అకాల మరణంతో ఆ స్థానంలో ఎవరు వస్తారనే ఆసక్తి ప్రజల్లో నెలకొని ఉంది. ఈ క్రమంలో నేడు సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సింగర్ మధుప్రియ ప్రత్యక్షమయ్యారు. దీనితో ఇకపై సీఎం కేసీఆర్ సభతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన అన్ని సభల్లో సింగర్ మధుప్రియ తన ఆట పాటతో అలరిస్తుందనే చర్చ నడుస్తుంది. దీనితో సింగర్ సాయిచంద్ స్థానంలో మధుప్రియ తన పాటలతో, మాటలతో అలరించనుంది.

నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోడుభూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ పట్టాలను పంపిణి చేయనున్నారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు. అయితే గాయకుడు సాయిచంద్ మృతి తరువాత బీఆర్ఎస్ నిర్వహించిన మొదటి సభ కావడంతో అతని స్థానంలో ఎవరు కనిపిస్తారనే చర్చ జరిగింది. కానీ నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభతో దానిపై ఓ క్లారిటీ వచ్చింది. తెలంగాణ బిడ్డ, ప్రముఖ జానపద గాయకురాలు మధుప్రియ నేటి బీఆర్ఎస్ సభలో పాల్గొనడంతో ఆ స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇలా ఉన్నట్టుండి మధుప్రియ బీఆర్ఎస్ బహిరంగసభలో కనిపించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ANN TOP 10