పట్టణ ప్రజలకు అవసరమైన నాణ్యమైన, తాజా కూరగాయలు, పండ్లు, మాంసం అన్నీ ఒకే చోట లభించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలోనూ సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. చిరు వ్యాపారులతో ముచ్చటించిన కేటీఆర్.. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు.









