AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సాయిచంద్ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్ కంటతడి

తెలంగాణ గాయకుడు, ఉద్యమకారుడు, తెలంగాణ వేర్‌హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో హఠాన్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని ప్రముఖ రాజకీయ నేతలంతా సందర్శిస్తున్నారు. కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ కూడా ప్రగతి భవన్ నుంచి నేరుగా సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. సాయిచంద్ భౌతికకాయాన్ని చూసి సీఎం కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్, హరీష్‌రావులు సైతం సాయిచంద్‌ భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి సాయిచంద్ వచ్చారు. అర్ధరాత్రి అస్వస్థకు గురైన సాయిచంద్‌ని కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నాగర్ కర్నూల్ గాయత్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు.

చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రాతి బొమ్మలలోనా పాటతో ఉద్యమంలో ప్రతి ఒక్కరిని సాయిచంద్ కంటతడి పెట్టించారు. సాయి చంద్ పాట లేని బీఆరెస్ సభ లేదంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సభ ఉంది అంటే సాయి చంద్ ఉండాల్సిందేనన్నారు. సాయి చంద్ పాటల కోసం మంత్రులు, నేతలు పోటీ పడే వారు. ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌ అంటే సాయి చంద్‌కు చాలా అభిమానం. అయినా కేసీఆర్‌ను సాయిచంద్ ఎన్నడూ వీడలేదు.

ANN TOP 10