AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్లీన్ చేస్తుండగా గన్ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ స్పాట్ డెడ్

మింట్ కాంపౌండ్‌లో విషాదకర ఘటన
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గన్ మిస్‌ఫైర్ కావడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఖైరతాబాద్‌లో ఉన్న మింట్ కాంపౌండ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది. తుపాకీని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా మిస్‌ఫైర్ కావడంతో ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

రామయ్య అనే హెడ్ కానిస్టేబుల్ ప్రింటింగ్ ప్రెస్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఉదయం డ్యూటీకి వెళ్లాడు. డ్యూటీలో ఉన్న సమయంలో SLR తుపాకీని శుభ్రం చేస్తుండగా.. అది ఒక్కసారిగా మిస్ ఫైర్ కావడంతో రామయ్య ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో రామయ్యకు తీవ్ర గాయాలవ్వగా.. అధికారులు వెంటనే నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రామయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.

రామయ్య స్వస్థలం మంచిర్యాలగా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా మింట్ కాంపౌండ్‌లో సెక్యూరిటీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో రామయ్య మృతదేహాం ఉంది. రామయ్య మృతిపై కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

ANN TOP 10