AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సమాజహితమే బక్రీద్ సందేశం

ఖైరతాబాద్ ప్రజలకు బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి ఎంజీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు

(మన ఖైరతాబాద్ ప్రతినిధి)
ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సమష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగత స్వార్ధాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజ హితం జరుగుతుందని, త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్ పండుగ” విశ్వ మానవాళికి అందిస్తుందని ఎంజీఆర్ తెలిపారు. బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని ఎంజీఆర్ అన్నారు.సకల మత విశ్వాసాలను సాంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదని ఆయన అన్నారు.

ANN TOP 10