AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్ ను కలిసిన ఎంజీఆర్

విదేశీపర్యటన ద్వారా వేలకోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు ధన్యవాదాలు
ఖైరతాబాద్ ప్రజల తరుపున థ్యాంక్స్ చెప్పిన ఎంజీఆర్
డైనమిక్ లీడర్ కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అద్భుత ప్రగతి

(మన ఖైరతాబాద్ ప్రతినిధి)
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి మంగళవారం కలిశారు. విదేశీపర్యటనకు వెళ్ళి హైదరాబాద్ నగరానికి, తెలంగాణకు వేలకోట్ల పెట్టుబడులు సాధించిన డైనమిక్ లీడర్ కేటీఆర్ కు ఈ సందర్భంగా ఎంజీఆర్ థ్యాంక్స్ చెప్పారు. హైదరాబాద్ ప్రగతికి భరోసా కేటీఆర్ అని , ఆయన లాంటి లీడర్ ఉండడం అద్రుష్టమన్నారు. కేటీఆర్ నాయకత్వంలోనే హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ సిటీగా గుర్తింపుపొందిందని, లక్షలమందికి ఉపాధి కల్పించే కేంద్రంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన సంక్షేమపథకాలు ప్రతిఇంటినీ, ప్రతి గుండెనీ చేరాయన్నారు.

ANN TOP 10