AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్యామ్ మరణం అత్యంత బాధాకరం: ఎన్‌టిఆర్

తన అభిమాని శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన విషయమని నటుడు జూనియర్ ఎన్‌టిఆర్ సంతాపం తెలిపారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనుసును కలచి వేస్తుందన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లాలో జూనియర్ ఎన్‌టిఆర్ వీరాభిమాని శ్యామ్ మణికట్టు వద్ద బ్లేడ్ తో కోసుకొని అనంతరం ఉరేసుకున్నాడు. బ్లేడ్ మాత్రం అతడి జేబులో దొరికింది. హత్య చేసి ఉరేశారని అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

ANN TOP 10