AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేంద్రానికి దమ్ముంటే.. దేశంలో ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలి

బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ ఫైర్
బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ.. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి.. బీఆర్ఎస్ ఎవరికీ ఏ టీమ్ కాదు.. అంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పండరీపూర్‌ సమీపంలోని సర్కోలి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో పరివర్తన తెచ్చే పార్టీ BRS అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తమపై కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు KCR కౌంటర్‌ ఇచ్చారు. A టీమ్‌, B టీమ్‌ అని కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. తాము ఏ పార్టీకి A టీమ్‌.. బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. తమది రైతులు, దళితులు, అణగారిన వర్గాల టీమ్‌ అని కేసీఆర్‌ అన్నారు.

దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ స్పష్టంచేశారు. కేంద్రానికి దమ్ముంటే.. దేశంలో ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న జల విధానాలను బంగాళాఖాతంలో వేయాలంటూ ఫైర్ అయ్యారు. మనకంటే చిన్న దేశాలు అభివృద్ది చెందాయని.. బీఆఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలంటూ కోరారు.రైతులు తమ వెంట ఉంటే తాము ఎవరికో టీమ్‌ అవ్వాల్సిన అవసరమేంటని కేసీఆర్‌ ప్రశ్నించారు. మహారాష్ట్ర వైపు తాము వస్తూ మూడు నెలలు కాలేదని, అప్పుడే తమపై ఎందుకింత ఆక్రోశం, ఆగ్రహమని కేసీఆర్‌ ప్రశ్నించారు.

దేశంలో పరివర్తన వస్తే దేశంలోని ప్రతీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మేకిన్‌ ఇండియా అని చెప్తుంటే దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఎందుకు కనిపిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. మేకిన్‌ ఇండియా ఎక్కడికి పోయిందని నిలదీశారు. విధానాలు మారాల్సిన అవసరం ఉందని, దేశం మారితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేసీఆర్‌ అన్నారు.

ANN TOP 10