AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆత్మీయంగా పలకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ..

బాలాపుర బస్తీలో మన్నె గోవర్ధన్‌రెడ్డి పర్యటన
గోవర్ధన్‌రెడ్డికి స్థానికుల ఆత్మీయ స్వాగతం
శ్రీకృష్ణమందిరంలో ప్రత్యేక పూజలు
(ఖైరతాబాద్‌ ప్రతినిధి)
ఖైరతాబాద్‌ డివిజన్‌ బాలాపుర బస్తీ శ్రీకృష్ణమందిరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఖైరతాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధ్దన్‌ రెడ్డి(ఎంజీఆర్‌) ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎంజీఆర్‌కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మన్నె గోవర్ధన్‌రెడ్డి బస్తీలో పర్యటించారు. స్థానికులను అప్యాయంగా పలకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారానికి భరోసా నిస్తూ ముందుకు సాగారు. అంతకు ముందు మన్నె గోవర్ధన్‌రెడ్డికి స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు.


ANN TOP 10