ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. జులై 4న రాష్ట్రపతి ముర్ము నగరంలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. సోమవారం రోజున సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. 4వ తేదీ సాయంత్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్ చేపట్టాలి. ప్రొటోకాల్‌లో లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలి అని సీఎస్ ఆదేశించారు.









