మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు పర్యటన కొనసాగుతున్నది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ (మంగళవారం) ఉదయాన్నే సోలాపూర్ నుంచి పండరీపూర్ చేరుకున్నారు. పండరీపూర్‌లోని శ్రీవిట్టల్ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు. సీఎం వెంట బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌రావు, డీ దామోదర్ రావు, పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రత్యేక పూజల అనంతరం సమీప గ్రామంలో పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. అక్కడ స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు శక్తిపీఠం తుల్జాపూర్ భవానీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు.









