AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పట్టపగలే నడిరోడ్డుపై.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య

కడప జిల్లాలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బుర్ఖా ధరించి వైసీపీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డిపై దాడి చేశారు. వేట కొడవల్లతో శుక్రవారం ఉదయం (జూన్‌ 23) దారుణంగా పొడిచి హత్య చేశారు. భూ తగాదాల కారణంగానే ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కడపకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి మరి కొంత మందితో కొంత కాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం జిమ్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో బుర్ఖా ధరించిన ఇద్దరు వ్యక్తులు శ్రీనివాసులు రెడ్డిపై వేట కొడవల్లతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు రెడ్డి మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు ఫైల్‌ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలోని సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లిఖార్జున్ హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

ANN TOP 10