ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ లోని కొన్ని సన్నివేశాలను, సంభాషణలను మార్చనున్నారు. సినిమాపై వస్తున్న విమర్శల నేపథ్యంలో పలువురు చేస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకున్న చిత్ర బృందం మార్పులు చేస్తున్నట్లు ‘ఆదిపురుష్’ టీమ్ ప్రకటించింది. సాంకేతికంగా ఇప్పుడు ఫీల్‌ను కొనసాగిస్తూనే సంభాషణల్లో మార్పు చేయబోతున్నారు. అతి త్వరలో ఈ మార్పులతో కూడిన సినిమాను థియేటర్‌లో చూడవచ్చని చిత్ర బృందం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
‘‘తొలి రోజే పాన్ ఇండియా స్థాయిలో రూ.140 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రికార్డ్ స్థాయి సక్సెస్ వెళ్తున్న సమయంలో సంభాషణలు మార్పు చేయడం అనేది టీమ్‌కు సాహసం అనే చెప్పాలి. అయితే సినిమాకు సక్సెస్‌ను ఇచ్చే ప్రేక్షకుల మనోభావాలను, సెంటిమెంట్స్, వారి సూచనలను గౌరవించడం అన్నింటి కన్నా ముఖ్యం’’ అని భావిస్తున్నాం’’ అని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతీసనన్ జానకిగా నటించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్ భూషణ్‌కుమార్ నిర్మాత.









