AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌లో అభ్యర్థులను నిర్ణయించేది కేసీఆరే : బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) అభ్యర్థులను కూడా సీఎం కేసీఆరే (CM KCR) డిసైడ్ చేస్తారని అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బడ్డిపల్లి గ్రామంలో మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా టిఫిన్ బైటక్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 30 మంది కాంగ్రెస్అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారన్నారు. మహిళల దుస్తుల మీద కాకుండా.. ఉగ్రవాదుల మీద దృష్టి పెట్టాలని సూచించారు.

అసలు మహమూద్ ఆలీ హోంమంత్రి అని ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వస్తారని.. సీఎం కేసీఆర్ వస్తారా? అని సవాల్ చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో చర్చకు సిద్ధమా? అన్నారు. హైదరాబాద్ దేశ రెండో రాజధానిపై పార్టీలో చర్చిస్తామని, తెలంగాణకు ఏది మంచో అదే చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ANN TOP 10