AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భార్యపై కోపంతో కూతురిని మంటల్లో తోసేసి.. ఫాదర్స్‌ డే రోజున దారుణం..

ఫాదర్స్‌ డే రోజునే దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కూతురిని మంటల్లో తోసేశాడో తండ్రి. ఈ దారుణ ఘటన నిజమాబాద్ జిల్లా బాల్కొండ మండలం బుస్సా పూర్‌లో చోటు చేసుకుంది. నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందని కక్ష పెంచుకున్న నిందితుడు కాశిరాం.. గత నెలలో భార్య ఉంటున్న ఇంటికి వచ్చి.. బట్టలకు నిప్పు పెట్టి, అదే మంటల్లో కుతూరును తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజామాబాద్‌ జిల్లా బుస్సాపూర్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు చెప్పిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ కాలనీకి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు. ఈ దంపతులకు సితారి సమ్మక్క (10), సితారి సారక్క (9) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం కాశీరాం దంపతులు బుస్సాపూర్‌ గ్రామానికి వలస వచ్చారు .అయితే అదే రోజు భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో పోసాని చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. తీవ్ర కోపోద్రిక్తుడైన కాశీరాం ఇంటికి నిప్పు పెట్టాడు. మొదట పిల్లల దుస్తులను వేసిన అతను ఆ తర్వాత చిన్న కూతురు సారక్కను కూడా తోసేశాడు. పెద్ద కుమార్తె మాత్రం పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది.

ANN TOP 10