AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వీఆర్ఎస్‌ వార్త‌ల‌పై డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు ఏమన్నారంటే..

వీఆర్ఎస్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై తెలంగాణ ప‌బ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్పందించారు. నా ఉద్యోగానికి నేను రిజైన్ చేయబోతున్నానని, వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా మీకు తెలియజేస్తాను. కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయడానికి నా వంతు కృషి చేస్తున్నాను.

రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తున్నాను అని డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. అందరూ కోరుకుంటున్నట్టుగా కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే‌గా పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే తప్పకుండా ఆయన ఆదేశాలని పాటిస్తాను‌. అప్పటివరకు దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను అని డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు కోరారు.

ANN TOP 10