తెలుగు చిత్ర పరిశ్రమలో తీగలాగితే డ్రగ్స్ డొంక కదులుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కబాలి తెలుగు హక్కులను కొనుగోలు చేసిన ప్రముఖ నిర్మాత కెపి చౌదరిని డ్రగ్ ట్రాఫికింగ్ విచారణలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంబంధించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చౌదరిని సైబరాబాద్ పోలీసులు జైలుకు తరలించారు. అతని వద్ద కొకైన్ కూడా దొరికింది. కేపీ చౌదరి గత కొన్ని నెలలుగా గోవాలో నివాసం ఉంటున్నారు. మాదక ద్రవ్యాల వ్యాపారంతో అతడి ప్రమేయం ఉన్నట్లు తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు ఆ బంధంపై ఆరా తీస్తున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి ఇంకా కొన్ని తెలియాల్సి ఉంది.
డ్రగ్ రాకెట్‌పై తెలంగాణ ఎక్సైజ్ శాఖ,పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇక డ్రగ్ మాఫియా ఖేల్ కతమనుకుంటే గోవా- టు హైదరాబాద్.. హైదరాబాద్ టు గోవా.. డ్రగ్ రాకెట్ మళ్లీ గుప్పుమంది. కబాలి నిర్మాత కెపి చౌదరిని డ్రగ్ అరెస్ట్‌తో తెర మీదకు సినీ డ్రగ్స్ లింక్స్. కేపి చౌదరి అరెస్ట్‌తో పలువురు సెలబ్రిటీల్లో గుబులు మొదలైంది. కేపీ చౌదరి నుంచి మొత్తం 4 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ 4 ఫోన్ల నుంచి కాల్ డేటాను సేకరిస్తున్నారు. కే పి చౌదరి నిర్వహించిన పార్టీలకు హాజరయ్యిన సెలెబ్రిటీల లిస్ట్ తయారు చేస్తున్నారు పోలీసులు.









