ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం మహా విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది దుర్మరణం చెందగా.. 1100 మందికి పైగా గాయపడ్డారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. తదితర మంత్రులు సంఘటన జరిగిన ప్రాంతంలో మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు.
క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్- హావ్‌డా ఎక్స్‌ప్రెస్ రైళ్ల శిథిలాలను వేగవంతంగా తొలగించి.. రైళ్ల రాకపోకల కోసం ట్రాక్ ను నిర్మిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు రాజకీయంగా కలకలం రేపాయి. బాలేశ్వర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
గతంలో రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. అప్పుడు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహుదూర్ శాస్ర్త్రీ రాజీనామా చేశారని గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా.. విపత్కర పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన విపక్షాలు.. ఆరోపణలు చేయడం తగదంటూ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు ప్రమాదం జరిగిన తీరుపై స్పందించే విధానం ఇదేనా అంటూ కాషాయ పార్టీ నేతలు విపక్షాలకు కౌంటర్ ఇస్తున్నాయి.