అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాళ్లు తట్టుకుని తూలి కిందపడ్డారు. కొలరాడోలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపారు. ఆ వెంటనే ఆయన ఎలాంటి సాయమూ లేకుండానే తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు.
ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని వైట్‌హౌస్ ప్రకటించింది. అధ్యక్షుడు కింద పడిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, దాదాపు 90 నిమిషాలపాటు జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో విద్యార్థులకు బైడెన్ సర్టిఫికెట్లు బహూకరించారు. 80 ఏళ్ల వయసులో అమెరికాకు అధ్యక్షుడై చరిత్ర సృష్టించిన బైడెన్ గతంలోనూ పలుమార్లు ఇలానే తూలిపడ్డారు. ఆయన సొంత రాష్ట్రమైన డెలావర్‌లో బైక్ రైడింగ్ చేస్తూ ఒకసారి కిందపడ్డారు. ఒకసారి అధ్యక్షుడి విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానం ఎక్కుతూ మెట్లపై తూలిపడ్డారు.









