AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ కీర్తి అజరామరం : పవన్‌ కల్యాణ్‌

తెలంగాణ కీర్తి అజరామరం అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి 22 వరకు సాగే దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకం అని చెప్పారు. ఎందరో యోధుల ప్రాణత్యాగంతోనే తెలంగాణ ఆవిర్భవించిందని వెల్లడించారు. పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ANN TOP 10