AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు

పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో తనిఖీలు
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఫార్మా, రియల్ ఎస్టేట్ కంపెనీలలో తనిఖీలు జరుగుతున్నాయి. నగరవ్యాప్తంగా దాదాపు 30 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోహినూర్ గ్రూప్‌తో పాటు రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో తనిఖీలు చేపడుతున్నారు. కోహినూర్ గ్రూప్ అఫ్ కంపెనీ ఎండీ మజీద్‌తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తోన్నారు. పలు డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు ఆదాయానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కోహినూర్ కంపెనీ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నడిపిస్తోంది. పలు ప్రభుత్వ భూముల్లో కోహినూర్ గ్రూపు వెంచర్లు వేసింది. ఈ కంపెనీ వెనుక ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక రాజకీయ నాయకుడికి బినామిగా ఉన్నట్లుగా ఐటీ అధికారులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కోహినూర్ గ్రూప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. రాజకీయ నాయకుడికి బినామీగా ఉండటంతో ఈ ఐటీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆ రాజకీయ నాయకుడు ఎవరనే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.

కోహినూర్ గ్రూపుతో పాటు ఎంఎం కన్‌స్ట్రక్షన్ నాజిద్‌ఖాన్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో ఐటీ దాడులు చోటుచేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10