ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి రోజున సెలవు ఇవ్వడానికి అంగీకరించారు. గురుద్వారాల్లో పూజారులైన గ్రంధీలకు పార్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. సిక్కు మైనార్టీ విద్యాసంస్థ ఏర్పాటుకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపుకు అంగీకరించారు. సిక్కులు పారిశ్రామికంగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.









