AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆనాడే అన్నాడట.. హీరోయిన్‌ను పెళ్లాడతానని..!

జీవితంలో తాను ఎంతో ఎత్తుకు ఎదుగుతానని..ఆపై ఓ హీరోయిన్‌ను పెళ్లాడతానని విరాట్‌ కోహ్లీ చిన్నప్పుడే చెప్పాడట. ఈ విషయాన్ని విరాట్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌ షల్‌ సోంధి తల్లి నేహా సోంధి వెల్లడించారు. ఈ ఆసక్తికర విషయానికి సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘‘ఢిల్లీలోని మదన్‌లాల్‌ అకాడమీ ఎదుట ఓ పెద్ద సినిమా పోస్టర్‌ కనిపించింది. అది చూసిన కోహ్లీ..‘నేనూ ఒకనాడు పెద్ద పొజిషన్‌కు వెళతా. ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటా’ అని అన్నాడు. విధి రాత ప్రకారం అలానే జరిగింది. ఆ నాటి సంఘటనను తలుచుకుంటే నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది’’ అని నేహా సోంధి ఆ వీడియోలో పేర్కొన్నారు. స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగాక.. 2013లో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మతో లవ్‌లో పడిన విరాట్‌.. 2017లో ఆమెను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ANN TOP 10