హైదరాబాద్: టాలీవుడ్ సినీ నటుడు శరత్ బాబు(71) అస్వస్థతకు గురికావడంతో గురువారం గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నారని వైద్యు నిపుణులు పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.









