AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లు..

ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు పిల్లలతో కలిసి పలు ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో వేసవిలో రైళ్లు, బస్సులు అన్నీ రద్దీగా ఉంటాయి. అయితే తాజాగా సమ్మర్ సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. రద్దీ దృష్ట్యా పలు స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్టు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Train No. 07003: హైదరాబాద్ నుంచి సోలాపూర్ కు ఈ నెల 24 నుంచి మే 14వ తేదీ వరకు ప్రతీ రోజు స్పెషల్ ట్రైన్ ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ హైదరాబాద్ లో ఉదయం 6 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 12.20 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

Train No.07004: సోలాపూర్-హైదరాబాద్ ట్రైన్ ను సైతం ఏప్రిల్ 24 నుంచి మే 14వ తేదీ వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ సోలాపూర్ లో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరి.. రాత్రి 8.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. అదే విధంగా పలు రైళ్ల వివరాలు ఈ దిగువన ఉన్నాయి.. ప్రయాణికులు పరిశీలించుకుని జర్నీ చేయాలని రైల్వే అధికారులు తెలిపారు.

ANN TOP 10