గదగ్ నగరానికి సమీపంలో హైవేపై చిరుత కనిపించింది. బింకదకట్టి నుంచి గదగ్ సర్వీస్ రోడ్డుపై చిరుతను గుర్తించారు. రెండు రోజులక్రితం చిరుత రోడ్డుపక్కన ఉండడాన్ని గుర్తించారు. ఇదే సమయంలో ఇరువురు ద్విచక్ర వాహనదారులు అదే మార్గంలో వచ్చారు. చిరుతను చూసి వెనక్కి వెళ్లారు. అయితే కొద్ది సేపటికి బస్సు అదే మార్గంలో ముందుకెళ్లింది. చిరుత రోడ్డుపై కనిపించడంతో ఆ ప్రాంత వాసులలో ఆందోళన నెలకొంది. రాత్రివేళల్లో సంచారానికి వెనుకడుగు వేస్తున్నారు.









