AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాఠశాల్లో ఘర్షణ.. కత్తితో పొడిచిన విద్యార్థి

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం హైస్కూల్లో దారుణం చోటుచేసుకోంది. తొమ్మిదో తరగతి విద్యార్థిని మరో విద్యార్థి చాకుతో పొడిచేశాడు. ఉపాధ్యాయుల సమక్షంలో పరీక్ష కేంద్రంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిన్ని వెంటనే ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. దాడికి పాల్పడిన విద్యార్థి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10