AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బైక్‌పై యువకుడి స్టంట్స్.. వీడియో షేర్ చేసిన సజ్జనార్..

టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ విషయం అందిరికీ తెలిసిందే. ఆయన ప్రతి నిత్యం ఏదో ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రజలకు జాగ్రత్తలు చెప్పటం, అవగాహన కల్పించటం వంటివి చేస్తారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే వెంటనే స్పందిస్తారు. సమస్యను పరిష్కరిస్తారు. ఆర్టీసీ సంస్థలో పని చేసే వారిని ఎప్పటికప్పుడు పోత్సహిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తూ ఉంటారు.

తాజాగా.. సజ్జనార్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆయన పోస్టు చేసిన వీడియోకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ యువకుడు నడిరోడ్డుపై బైకుపై స్టంట్ చేశాడు. బైక్ రన్నింగ్‌లో ఉండగానే హ్యాండిల్ వదిలేసి బైక్‌పైనే వెనక్కి పడుకున్నాడు. కొంత దూరం వరకు అలాగే ముందుకు వెళ్లిన బైక్.. అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ షాప్‌లోకి దూసుకెళ్లింది. అతడు స్టంట్స్ చేసిన టైమ్ అర్ధరాత్రి కావటం, రోడ్డుపక్కన ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో స్టంట్ చేసిన యువకుడు స్వల్ప గాయాలతో బయటపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే అతడు పీకలదాకా తాగి అలా డేంజర్ డ్రైవింగ్ చేసినట్లు సమాచారం. ఇదంతా వెనకనుంచి నుంచి మరో బైక్‌పై ప్రయాణించిన యువకుడు వీడియో తీశాడు. అయితే ఇది ఎక్కడో జరిగిందో తెలియదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!’..అంటూ ఆ వీడియోకు సజ్జనార్ క్యాప్షన్ ఇచ్చారు.

ANN TOP 10