AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్‌ క్లియర్‌.. వైసీపీ పిటిషన్‌ కొట్టివేత..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజన అంశాలపై కీలక స్పష్టత ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠకు తెరపడినట్లయింది.

ఓటర్ల జాబితాపై విచారణ సందర్భంగా ఎస్ఐఆర్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించకూడదన్న వైసీపీ వాదనను ధర్మాసనం అంగీకరించలేదు. ఎస్ఐఆర్‌ తాజా జాబితా సిద్ధమైనా, పాత ఓటర్ల జాబితాతోనైనా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసినట్లు సమాచారం.

వార్డుల పునర్విభజన అంశంపైనా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికిప్పుడు వార్డుల పునర్విభజన చేపట్టాలని కోరడం ఎన్నికలను ఆలస్యం చేసే ప్రయత్నమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అడ్డంకులు తొలగినట్లయింది.

ANN TOP 10