ఈ విద్యా సంవత్సరం నుంచి కీలక మార్పులు చేసింది తెలంగాణలోని ఇంటర్ బోర్డు. సిలబస్‌తోపాటు పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. కొన్ని సబ్జెక్టులకే పరిమితమైన ప్రాక్టికల్స్, అన్ని సబ్జెక్టులకు తీసుకొచ్చింది. కొత్త విధానంపై విద్యార్థులకు అవగాహన కలిగించాలని స్పష్టం చేసింది. వచ్చింది. మొత్తం మార్కుల్లో 80 శాతం థియరీ కాగా, 20 శాతం ప్రాక్టికల్స్ కు మార్కులు కేటాయించింది. ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటే విద్యార్థులు అందులో పాస్ కావాలంటే కనీసం 28 మార్కులు రావాలి. మిగతావి ప్రాక్టికల్స్‌కు కేటాయించిన 20 మార్కులలో కనీసం 7 మార్కులు వస్తే పాస్ అయినట్టు లెక్కిస్తారు. గతంలో సెకండియర్‌లో మాత్రమే ప్రాక్టికల్స్ పద్దతి ఉండేది. ఈ ఏడాది నుంచి ఫస్టియర్‌లో సగం.. సెకండియర్‌లో మరో సగం చొప్పున ప్రాక్టికల్స్ ఉండనున్నాయి.
ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయంలో స్పష్టత ఇచ్చింది ఇంటర్ బోర్డు. ఫస్టియర్ విద్యార్థులకు ఒకే పుస్తకం ఉంటుందని, సెకండ్ ఇయర్‌లో టెక్స్ట్ బుక్‌తోపాటు ఇంగ్లిష్ ప్రాక్టికల్ మాన్యువల్ బుక్ ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త మార్పులు, సిలబస్ వివరాలు, సబ్జెక్టుల వారీగా మార్కుల కేటాయింపు వంటి సమాచారం అధికారిక వెబ్‌సైట్ https://tgbienew.cgg.gov.inలో పేర్కొన్నట్లు వెల్లడించారు బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్. అయితే కొత్త విధానంపై విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి లేకుండా చూడాల్సిన బాధ్యత కళాశాలల యాజమాన్యాలపై ఉందని తేల్చిచెప్పింది.
కొత్త రూల్స్ తీసుకొచ్చిన ఇంటర్ బోర్డు
ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు? పాస్ మార్కులు ఏ విధంగా లెక్కగడతారు? అనే వివరాలు ప్రిన్సిపాళ్లు-లెక్చరర్లు విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలని ఆదేశించింది. విద్యార్థులంతా కొత్త విధానాన్ని గమనించి అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సి వుంది. ఇంటర్ ఫస్టియర్‌లో ఇంటర్నల్ మార్కుల విషయంలో కాలేజీల ఇష్టారాజ్యానికి వదిలేయకుండా చెక్ పెట్టేందుకు ఇంటర్ బోర్డు కొత్త రూల్స్ తెచ్చింది. కాలేజీల చేతివాటానికి కళ్లెం వేసింది. అత్యంత పకడ్బందీగా కామన్ వ్యాలిడేషన్ రూల్స్ తీసుకొచ్చింది.
సవరించిన సిలబస్, కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలను అన్ని కాలేజీలకు బోర్డు పంపింది. ఇంటర్నల్ విషయంలో లెక్చరర్లు తమ ఇష్టమొచ్చినట్లు కాకుండా, పాఠ్యపుస్తకాల్లో సూచించిన విధంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఆధారంగా విద్యార్థులను మూల్యాంకనం చేయాలి. పరీక్షల కోసం కాకుండా విద్యార్థుల్లో థింకింగ్, రీజనింగ్, క్రియేటివిటీ, వ్యక్తిత్వ వికాసాన్ని ఉండేలా అసెస్‌మెంట్లు సాగాలని పేర్కొంది.








