బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవల్దార్ మల్లేశ్‌కు ఆయుధాగారం ఇన్‌చార్జ్‌లు సహకరించినట్లు విచారణలో తేలింది. దీంతో వెపన్స్ గోడౌన్ కీపర్లు వినోద్, శేషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వినోద్, శేషులు ఆయుధాల చోరీలో మల్లేశ్‌కు సహకరించినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారు. మల్లేశ్‌తో వారికి భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈ కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు.
మల్లేశ్ నివాసంలో ఇప్పటికే పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలకమైన ఆర్మీ ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మల్లేశ్‌ను 10 రోజుల పోలీసు కస్టడీలో విచారిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ కోసం మల్లేశ్‌ను నేరుగా మద్రాస్ రెజిమెంట్‌కు తీసుకెళ్లారు. ఈ కేసులో మరిన్ని వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.








