హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం గడిచిన మూడు రోజులు జరుగుతున్నాయి. నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న ఓ ఎస్ఐ, రోడ్డు దాటుతుండగా టూ వీలర్ వచ్చి ఆయన్ని బలంగా ఢీ కొట్టింది. ఆయన స్పాట్‌లో పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి ఎస్ఐని తరలిస్తుండగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
హైదరాబాద్ వినాయకుడి నిమజ్జనాలు అంగరంగం వైభవంగా జరుగుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా నగరం నలుమూలల నుంచి వినాయకుడి విగ్రహాలు హుస్సేన్ సాగర్‌కు తరలివస్తున్నాయి. అయితే నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ ఎస్‌ఐని టూ వీలర్ ఢీ కొట్టింది. వెంటనే ఆయన్ని ఆసుపత్రి తరలించారు సిబ్బంది. అక్కడ చికిత్స తీసుకుంటూ ఎస్ఐ మృతి చెందారు. ఈ విషయం తెలిసి పోలీసు అధికారులు షాకయ్యారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద డ్యూటీ చేస్తున్నారు కొత్తగూడెం టూ టౌన్ ఎస్సై వెంకన్న గణేష్. రోడ్ల వాహనాల ట్రాఫిక్ కాస్త తగ్గడంతో కానిస్టేబుల్‌తో కలిసి ఎస్ ఐ గణేష్ రోడ్డు దాటుతున్నారు. రోడ్డు సగం దాటిన తర్వాత కానిస్టేబుల్ చేయి చూపిస్తూ అడుగులు వేస్తున్నారు. ఈలోగా వేగంగా వచ్చిన టూ వీలర్.. తొలుత కానిస్టేబుల్‌ని ఢీ కొట్టింది. ఆయన పక్కనున్న ఎస్ఐని హిట్ కొట్టింది. ఆ తర్వాత వాహనం.. మరొక వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదానికి కారణమైన టూ వీలర్ ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు
ఈలోగా ఎస్‌ఐ వెంకన్న గణేష్ రోడ్డుపై కుప్పకూలిపోయారు. వెంటనే పోలీసులు పరుగున అక్కడికి వచ్చి, ఆయన్ని అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన వెంకన్న చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆ ప్రాంత పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి వాహన యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వెంకన్న వయస్సు 55 ఏళ్లు. జరిగిన ఘటనతో డ్యూటీలోని పోలీసుల్లో విషాధం అలముకుంది. ఎస్ఐ మృతి చెందిన విషయం తెలియగానే ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.








