AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

22A మహా కుంభకోణం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ భవన్‌లో 22ఏ భూ బాధితులతో కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలది.. అంతులేని దోపిడీ అని విమర్శించారు. 22A భూముల అంశంపై.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులుగా మారారని విమర్శించారు. ఒక్క కలం పోటుతో ఊళ్లకు ఊళ్లను 22ఏలో పెట్టిస్తున్నారని హరీశ్ ఆరోపించారు. 22Aపై నిలదీస్తామనే బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. అయినా పోరాటం కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు హరీష్ రావు.

22A మహా కుంభకోణమని ఆరోపించారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే 22A జాబితాలో ఉన్నాయని.. ఇప్పుడు కోటి 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని చెప్పారు.

22Aపై బీఆర్ఎస్ అసత్య ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. నిషేధిత జాబితాలో అత్యధికంగా భూమిని చేర్చింది గత ప్రభుత్వమేనని చెబుతున్నారు. ధరణిని అడ్డుపెట్టుకుని వందల ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. 22Aతో అవన్నీ బయటపడుతాయనే భయంతోనే బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోందన్నారు.

ధరణిలో వేలిముద్ర లేకుండా ఇంచు భూమి కూడా అటూ ఇటూ కాదన్నారు కేటీఆర్. భూభారతిలో భూముల గోల్‌మాల్ జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

ANN TOP 10