AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేపాల్లో అకస్మిక వరదలు.. 16 మంది మృతి..! 105 మంది భారతీయులు గల్లంతు..!

నేపాల్ లో అకస్మిక వరదలు సంభవించాయి. భారత సరిహద్దుల గుండా ప్రవహించే భోటే కోషి నది (Bhote Koshi River) ఒక్కసారిగా ఉప్పొంగింది. టిబెట్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల నదిలో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. దీంతో భోటే కోషి ప్రవహించే నేపాల్లోని నువాకోట్, ధాడింగ్, రసువా జిల్లాల్లో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. కొండల నుంచి దూసుకొచ్చిన రాకాసి వరద ధాటికి పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ కనీసం 16 మంది చనిపోగా.. 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారు.

టిబెట్ కొండల నుంచి ఒక్కసారిగా విరుచుకుపడిన వరద నీరు పర్వత లోయల గుండా వేగంగా ప్రవహిస్తూ సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడింది. వరద ఉధృతికి అనేక ఇళ్లు, గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పటివరకు నువాకోట్, ధాడింగ్ జిల్లాల పరిధిలో ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీస్ అధికార ప్రతినిధి అభినారాయణ కాఫ్లే తెలిపారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నేపాల్ టూరిజం బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి మొత్తం 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వీరిలో 291 మంది విదేశీయులు కాగా 93 మంది నేపాల్ స్థానికులు ఉన్నారు. విదేశీయుల్లో అత్యధికంగా 105 మంది భారతీయ పౌరులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన నేపాల్ రక్షణ బలగాలకు కూడా ఈ వరద తాకిడి తగిలింది. రసువా జిల్లాలో 26 మంది నేపాల్ పోలీసులు, 7 మంది ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వరద నీటిలో కొట్టుకుపోయారు.

ఒక్కసారిగా వచ్చిన వరద వల్ల నేపాల్‌లోని రహదారులు, విద్యుత్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (NEA) పరిధిలోని ఆరు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలు, సబ్‌స్టేషన్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్లోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు పలు రోడ్లను వరద నీరు ముంచెత్తడంతో జాతీయ రహదారులపై రాకపోకలు బంద్ అయ్యాయ

అకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ఆర్మీ హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించింది. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా జాతీయ విపత్తు సంస్థతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలను సమీక్షించారు. వైద్య బృందాలు, రెడ్ క్రాస్, స్కౌట్స్ భాగస్వామ్యంతో బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నదీ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.

ANN TOP 10