AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దొంగనాకొడుగా అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి..!

మౌళి …’90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే వెబ్ సిరీస్ తో సత్తా చాటిన ఈ కుర్ర హీరో లిటిల్ హార్ట్స్ తో సూపర్ హిట్ చూసిన సంగతి తెల్సిందే.ఇక తాజాగా ఈ కుర్ర హీరో దొంగనాకొడుకు అంటూ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోగా కనిపించనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు.ఒక చేతిలో బ్యాగ్, చుట్టూ ఎగిరిపోతున్న బంగారు నగలు, పరుగెత్తుతున్న మౌళి .. ఇవన్నీ చూసిన తర్వాత ఇద ఓ క్రైమ్ కామెడీ అని  అర్థమైపోతుంది.

పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఫోకస్

ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్, రివెంజ్, పాన్ ఇండియా కథలే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు శ్రీను కంబాల ఈ సినిమాను పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఫోకస్ పెట్టిన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్  నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. 90వ దశకంలో వచ్చిన క్లాసిక్ కామెడీ సినిమాల ఫీల్ ఇందులో ఉండబోతుందట. అప్పట్లో హీరోలు పెద్ద ఫైట్లు చేయకపోయినా.. వాళ్ల అమాయకత్వం, పరిస్థితుల వల్ల పడే ఇబ్బందులు, వరుసగా జరిగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవి. ఇప్పుడు అదే స్టైల్‌ను నేటి జనరేషన్‌కు తగ్గట్టు కొత్త ట్రీట్‌మెంట్‌తో తీసుకొస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

 

మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌పై ఉన్న “Robbery Crime Comedy” అనే ట్యాగ్‌లైన్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. అంటే ఇది కేవలం దొంగతనం చేసే కథ కాదు.. ఆ దొంగతనం చుట్టూ తిరిగే ఫన్నీ సంఘటనలే సినిమాకు అసలు హైలైట్ అని అర్థమవుతోంది. అంతేకాదు.. Beware… Donga Naa Koduku is here to steal a few laughs” అంటూ ఇచ్చిన క్యాప్షన్ కూడా అందరినీ ఆకట్టుకుంది. డబ్బులు కాదు.. ప్రేక్షకుల నవ్వులనే దొంగిలించడానికి హీరో వస్తున్నాడనే ఫన్నీ మెసేజ్ అందులో దాగి ఉందని పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇక తనకి అచ్చొచ్చిన కామెడీ టైమింగ్‌తోనే మౌళి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్‌లో అతని ఎక్స్‌ప్రెషన్ కూడా అదే చెబుతోంది. ఏదో పెద్ద దొంగతనం చేసిన వ్యక్తిలా కాకుండా.. పరిస్థితుల వల్ల పరుగులు తీస్తున్న కుర్రాడిలా కనిపించడం మరింత ఆసక్తిని పెంచుతోంది.

సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ పోస్టర్‌పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. “హీరో నిజంగానే దొంగనా?”, “లేక ఎవరో చేసిన తప్పుకు ఇరుక్కుపోయాడా?”, “బ్యాగ్‌లో అసలు ఏముంది?”, “ఆ నగల వెనుక అసలు కథ ఏంటి?” అంటూ అభిమానులు అప్పుడే తమ బుర్రలకి పని పెట్టేస్తున్నారు. కొందరు అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన పూర్తి కామెడీ ఎంటర్ టైనర్  అవుతుందని అంటుంటే.. మరికొందరు ఇందులో మంచి ట్విస్టులు కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం కామెడీ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్ ఉంది.ముఖ్యంగా కథలో నవ్వులు, సస్పెన్స్, ఎమోషన్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉంటే అలాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధిస్తున్నాయి. ‘దొంగ నా కొడుకే’ కూడా అదే ఫార్ములాతో వస్తోందని ఇన్ సైడ్ వినిపిస్తున్న టాక్.చూడాలి మరి వరుస రెండు సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ తో సత్తా చాటిన మౌళి ఈ దొంగనాకొడుకు గా ఎలా ప్రూవ్ చేసుకుంటాడో !

ANN TOP 10