పౌరసరఫరాల్లో ఏపీ సంస్కరణలకు కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. కాకినాడ జిల్లాలో పీడీఎస్‌లో స్టీమ్ రైస్ పైలట్ ప్రారంభించారు. ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల పార్బాయిల్డ్ ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతిచ్చింది. రేషన్ దుకాణాల ద్వారా ‘మీ మార్ట్’ కాన్సెప్ట్ సేవలు అమలు చేయనుంది.
స్వర్ణ వెరైటీ బియ్యం..
రైతు బజార్లలో తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయం చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. స్వర్ణ వెరైటీ బియ్యాన్ని కిలో ధర రూ.40కు అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని ప్రభుత్వానికి కేంద్రమత్రి తెలిపారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు 500 గ్రాముల కందిపప్పు ప్రతిపాదనను తీసుకొచ్చారు. పెండింగ్’లో ఉన్న రూ.281 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డీలర్ల కమిషన్ పెంపు..
రాష్ట్రంలో ధాన్యం ట్రాకింగ్‌కోసం ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీ అమలు చేయాలని తెలిపారు. డిజిటల్ వాలెట్ ద్వారా సబ్సిడీల పంపిణీకి పైలట్ ప్రాజెక్ట్ ఎర్పాటు చేయనున్నారు. ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల కమిషన్ పెంపునకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. 29 వేల రేషన్ దుకాణాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు.








