AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ఓటర్ల నమోదు గడువు పొడిగింపు..!

తెలంగాణలో ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ (SIR) గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ తుది గడువును ఈ ఏడాది ఆగస్టు 3 వరకు పొడిగించారు. ఆ తర్వాత అర్హుల వివరాలతో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఆగస్టు 10న అధికారికంగా ప్రకటించనున్నారు.

 

జాబితా విడుదలైన వెంటనే.. అందులో ఏవైనా తప్పులున్నా లేదా కొత్తగా పేర్లు చేర్చుకోవాలన్నా ప్రజలు అభ్యంతరాలు తెలపడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు నెల రోజుల పాటు అభ్యతరాలు, క్లెయిమ్ల స్వేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం ఈ గడువును పెంచింది. ఓటర్లు యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు

ANN TOP 10