ముద్రగడ పద్మనాబం అంత్యక్రియలలో పోలీసులకు వైసీపీ నేతలకు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముద్రగడ పద్మనాబంనకు అధికార లాంఛనాలు వద్దు అని చెప్పినా వినకుండా పోలీసులు ఎందుకు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో ఫైర్ అయ్యారు.
పోలీసులపై అంబటి ఫైర్..
అధికార లాంఛనాలను ముద్రగడ సతీమణి తిరస్కరించారు. దీంతో పోలసులు వినకుండా కావాలని ఎందుకు చేస్తున్నారని, అంబటి రాంబాబుతో పాటు వైసీసీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎవరి మెప్పుకోసం ఇదంతా చేస్తున్నారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అటు పోలీసులకు ఇటు వైసీపీ నేతలకు మద్య తీవ్ర వాగ్వాదంతో గందరగోళ పరిస్థితుల్లోనే ముద్రగడ పద్మనాబం అంత్యక్రియలను పూర్తి చేశారు.
ప్రముఖుల సంతాపం
కాపు ఉద్యమనేతగా ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాబంకు పేరుంది. ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనంతరం ఆయన భౌతికాయాన్ని కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో ఉన్న స్వగృహనికి తీసుకువెల్లారు. ముద్రగడ పద్మనాబంను చూడటం కొసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు, రాజీయ ప్రముఖులు తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో ఘనంగి నివాలులర్పించారు.








