కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎ రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహరాష్ట్రలో వర్షాల వల్ల వస్తున్న గోదావరి నది జలాలను రాష్టంలో ఉన్న కరువు ప్రాంతానికి అందించాలని రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లడంకోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఈటల అవాస్తవాలు..
కాళేశ్వరం అంశంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హరీష్ రావు సూచనలతో ఈటల మాట్లాడాతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రాజేందర్ అవాస్తవాలు చెప్పారని సీఎం అన్నారు. ఆయనంటే మాకు గౌరవం. ఇప్పుడు ఆ గౌరవం కోల్పోయారని అన్నారు. ఆయన మాట్లాడేముందు సంబంధిత మంత్రి, NDSAతో మాట్లాడి ఉంటే బాగుండేది సీఎం వ్యాఖ్యానించారు. కవాలనే ప్రభుత్వం పై నింధలు వేస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.
కిలాడీ కమిటి..
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ముందు రెండు కమిటీలున్నాయి. ఒకటి కిలాడీ కమిటీ.. రెండోది NDSA కమిటీ. కిలాడీ కమిటీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల ఉన్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన NDSA ఏది చెబితే అదే చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కిలాడీ కమిటీ ఒత్తికి లొంగే ప్రసక్తే లేదు అంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు.
NDSA హెచ్చరించినా..
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కాదని NDSA తేల్చిచెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుందిళ్ల దెబ్బతినడం వల్ల నీటి మళ్లింపు మంచిది కాదని NDSA అప్పుడే హెచ్చరించిందని సీఎం తెలిపారు. బ్యారేజీల నిర్మాణంలో లోపాలను సరిదిద్దాలని సూచించినా ఆనాడు ప్రభుత్వం తప్పిదాలు బీఆర్ఎస్ పట్టించకోలేదని సీఎం తెలిపారు. CWC సంస్థ ప్రకారమే ప్రాజెక్ ట్‌పై ముందు కెళ్లాలని NDSA చెప్పిందని సీఎం రేవంత్ రడ్డి పేర్కోన్నారు.
గురుదక్షిణం కోసం రాదాత్తం
అందరూ కలిసి గురుదక్షిణ కోసమే ఏపీకి తెలంగాణ జలాలు ధారాదత్తం చేస్తున్నారంటూ హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. నిజంగా అన్నం తినేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా అని ఫైర్ అయ్యారు. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్టా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలు తరలించినప్పుడు హరీష్‌రావు గాడిదలు కాస్తున్నాడా? అప్పుడు మంత్రిగా నువ్వే ఉన్నావ్ కదా?’’ అంటూ సీఎం రేవంత్ గాటు వ్యాఖ్యలు చేశారు.
ఈటలకు సీఎం రేవంత్ సవాల్..
నేను రెండే రెండు డిమాండ్లు ఈటెల రాజేందర్‌కు చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్డీఎస్ఏ ను కలిసి నీళ్లు ఎత్తిపోయాలని చెప్పండి ఎన్డీఎస్ఏ కు మేము సంపూర్ణంగా సహకరిస్తామని సీఎం రేంత్ రెడ్డి స్పష్ట్రం చేశారు. సీబీఐ వద్ద మూలుగుతున్న కాళేశ్వరం కేసు పై విచారణ ముందుకు తీసుకెళ్లేలా కేంద్రాన్ని కోరాలని సీఎం రేవంత్ అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణను మేం సీబీఐకి అప్పగించామని, 2025 సెప్టెంబర్ 1వ తేదీన ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో నెం.104 జారీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికీ వరకు విచారణ ఎందుకు వేగంగా సాగడం లేదో సమాధానం చెప్పాలని ఈటలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
వాళ్లకి ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిదే..
కేసీఆర్, హరీష్ రావు మాంత్రికులు మామ అల్లుళ్లకు మంత్రాలు వచ్చని సీఎం అన్నారు. వాళ్ళిద్దరికి కాంట్రాక్టు ఇస్తాం నడిపించాలి. హరీష్ రావు, కేటిఆర్ అబద్దాలు ఆడుతున్నారని, ఇద్దరికి బెల్ట్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఎద్దేవ వేశారు. ఇద్దరికి బెల్ట్ ట్రీట్ మెంట్ ఇస్తే సరిపోతుందని, కేసీఆర్ ఫ్యామిలీ లూటర్స్, చీటర్స్ వాళ్ళను కోసి రక్తం చల్లితే రైతుల పంటలు పండుతాయని ఫైర్ అయ్యారు. వాళ్ళ బలుపు ,కొవ్వు తగ్గట్లేదు మెడిగడ్డ గేట్లు ఎత్తకపోతే మేము ఎత్తుతం అని కేటిఆర్ అంటున్నాడని, వెళ్లి గోదావరిలో దుకమని అన్నారు. మేము cbi కి ఎంక్వైరీకి ఇచ్సిందళ్ళ పునరుద్ధరించకుండా గేట్లు దించలేమని, సాంకేతిక నిపుణుల కమిటీ వచ్చాకే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పునరుద్దరిస్తామని సీఎం స్పష్ట్రం చేశారు








