AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కన్నమాల ఇవాన్ రాయెల్‌..! గిన్నిస్ రికార్డ్.. 8 ఏళ్ళ వయసులోనే అదరగొట్టిన చిచ్చరపిడుగు..

హైదరాబాద్,

హైదరాబాద్ కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు కన్నమాల ఇవాన్ రాయెల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపును అధికారికంగా అందుకుని వావ్ అనిపించాడు. కరాటేలో అద్వితీయ ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుంచి అధికారిక గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్ అందుకోవడంతో ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించిన ఇవాన్ రాయెల్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, నిరంతర సాధన, అంకితభావం కీలక పాత్ర పోషించాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు చిన్నారిని అభినందిస్తూ ఆయన భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు బాలుడు ప్రపంచ వేదికపై తన ముద్ర వేయడం ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. బాలుడి తండ్రి రాకేష్ కన్నమాల ఇటీవల ఎఎన్ఎన్ మహా అవార్డ్స్ లో బెస్ట్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ అవార్డ్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. అంకితభావం, క్రమశిక్షణ, సామర్ధ్యం, నిరంతర శ్రమ వీరి విజయానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి.

……….

ANN TOP 10