పెద్ది ..చరణ్,బుచ్చిబాబు కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్ మూటగట్టుకున్న సంగతి తెల్సిందే.. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడినా.. కలెక్షన్ల పరంగా మాత్రం మెగా పవర్ స్టామినా ఏంటో నిరూపించింది. అయితే, రెండు వారాల ప్రదర్శన తర్వాత ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. థియేటర్లలో రన్ అవుతున్న సినిమాకు అదనంగా 5 నిమిషాల 56 సెకన్ల ఫుటేజ్‌ని జత చేస్తూ ‘రీలోడెడ్ వెర్షన్’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
ఎమోషనల్ కనెక్ట్ పెంచే సరికొత్త సీన్స్
ఈ అప్‌డేట్ వెనుక మేకర్స్ ఆలోచన ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. లెంత్ ఎక్కువవుతుందనే కారణంతో మొదట ఎడిటింగ్ టేబుల్ మీద కట్ చేసిన కొన్ని కీలక దృశ్యాలను ఇప్పుడు మళ్లీ యాడ్ చేశారు. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఎమోషనల్ సీన్స్, అలాగే వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ కొత్త వెర్షన్‌లో హైలైట్‌గా మారనున్నాయని తెలుస్తుంది.
ఫస్ట్ హాఫ్‌లో ఎమోషన్ కాస్త లాగ్ అయిందనే కామెంట్స్ వినిపించగా, ఈ 6 నిమిషాల యాడింగ్ సీన్స్ సినిమాని స్పీడ్ పెంచుతుందని భావిస్తున్నారట మేకర్స్ . దీనికి తోడు, గురువారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను సాధారణ స్థాయికి తగ్గించడం మరో ప్లస్ పాయింట్. తక్కువ ధరలో, ఎక్కువ కంటెంట్‌తో సినిమాను చూసే అవకాశం లభించడంతో మాస్ ఆడియెన్స్, ఫ్యామిలీస్ థియేటర్ల వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.
లేట్ డెసిషన్.. ఆడియెన్స్‌ను రప్పిస్తుందా?
కానీ,మరో వైపు చూస్తే.. ఈ ‘రీలోడెడ్’ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ . సాధారణంగా సినిమా విడుదలైన మొదటి వారంలో ఇలాంటి మార్పులు చేస్తే ఫలితం ఉంటుంది. కానీ, ఇప్పటికే మెజారిటీ ఆడియెన్స్ సినిమాను చూసేసిన 14 రోజుల తర్వాత ఈ మార్పు చేయడం లేట్ అయిపొయింది అని అంటున్నారు ట్రేడ్ పండిట్స్.
కేవలం 6 నిమిషాల ఫుటేజ్ కోసం థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుడికి ఒకవేళ ఆ సీన్స్ అంతగా ఇంపాక్ట్ చూపించకపోతే, అది సినిమా నెగెటివ్ టాక్‌కు కారణం కావచ్చు. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బాక్సాఫీస్ హోల్డ్ తగ్గుతున్న తరుణంలో, ఈ ప్రయోగం వికసిస్తుందా లేక రివర్స్ అవుతుందా అనేది వేచి చూడాలి.
కలెక్షన్ల సునామీ.. 400 కోట్ల క్లబ్ వైపు అడుగులు!
టాక్‌తో సంబంధం లేకుండా రామ్ చరణ్ మాస్ పుల్ వల్లే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 315.98కోట్ల వసూళ్లు రాబట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాను విజువల్ వండర్‌గా మార్చాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.చూడాలి మరి ఈ సరికొత్త రీలోడెడ్ వెర్షన్ ఎలాంటి ఫలితాలని అందిస్తుందో








