అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంగ్లాండ్స్ బ్యాట్స్ ఉమెన్స్‌లో మెక్‌డోనాల్డ్ గే 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. స్మాలే, స్టోన్‌హౌజ్ తలో 11 పరుగులు చేశారు. భారత బౌలర్లలో టైటాస్ సాధు ఆరు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది. చోప్రా, అర్చన దేవిలకు తలో రెండు వికెట్లు దక్కాయి. స్వల్ప టార్గెట్‌ను టీమ్ ఇండియా ఈజీగా ఛేదించింది. మరో ఆరు ఓవర్లు మిగిలుండగానే విజయాన్ని అందుకున్నది. షెఫాలీ వర్మ (15 రన్స్), శ్వేత షెరవాత్ (5 రన్స్) తొందరగానే ఔట్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. కానీ సౌమ్య తివారీ (24 రన్స్) త్రిష (24 రన్స్) చక్కటి బ్యాటింగ్‌తో టీమ్ ఇండియాకు అద్భుత విజయాన్ని అందించారు.